లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే

143-3-696x392తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం -2018 బిల్లును బుధవారం (మార్చి-28) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య 12 వేల 741 గా ఉందన్నారు. ఇందుకు సంబంధించిన లిస్టును వివరించారు జూపల్లి. ఇందులో కొత్త గ్రామ పంచాయతీలు 4 వేల 380 కాగా.. వెయ్యి 326 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్టీలు ఉన్నారు. షెడ్యూల్డ్ గ్రామ పంచాయితీలు వెయ్యి 311 ఉన్నాయి. 12 వేల 741 గ్రామ పంచాయితీల్లో  లక్షా 13 వేల 270 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయితీలు ఉండగా.. అత్యల్పంగా మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

జిల్లాల వారీగా గ్రామ పంచాయితీలు

మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా – 61
రంగారెడ్డి – 560
వికారాబాద్ – 565

మహబూబ్‌నగర్ – 721
వనపర్తి – 254
జోగులాంబ గద్వాల – 255
నాగర్‌కర్నూల్ – 453

నల్లగొండ – 844
యాదాద్రి భువనగిరి – 401
సూర్యాపేట – 475

ఖమ్మం – 586
భద్రాద్రి కొత్తగూడెం – 478

వరంగల్ గ్రామీణం – 401
వరంగల్ పట్టణం – 130
మహబూబాబాద్ – 461
జయశంకర్ భూపాలపల్లి – 415
జనగామ – 300

కరీంనగర్ – 306
పెద్దపల్లి – 261
జగిత్యాల – 380
రాజన్న సిరిసిల్ల – 255

ఆదిలాబాద్ – 467
కుమ్రంభీం ఆసిఫాబాద్ – 334
మంచిర్యాల – 311
నిర్మల్ – 396

నిజామాబాద్ – 530
కామారెడ్డి – 526

మెదక్ – 469
సంగారెడ్డి – 647
సిద్ధిపేట – 499

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy