లీజుకు నియో విమానం

Airదేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా తొలి ఎయిర్‌బస్‌ 320 నియో విమానాన్ని లీజుకు తీసుకుంది. చక్కని ఇంధన సామర్థ్యం ఉండే ఈ తరహా విమానాలను ఈ ఏడాదిలో మరో 13 లీజుకు తీసుకోనున్నట్లు తెలిపింది. ఏ320 నియో ప్లేన్‌ లో 12 బిజినెస్‌ క్లాస్‌ సీట్లతో సహా 162 సీట్లు ఉన్నాయి. ఈ విమానాన్ని ఎయిరిండియా కువైట్‌కు చెందిన అలాఫ్కో నుంచి లీజ్‌కు తీసుకుంది. గురువారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో  విమానానికి సంప్రదాయ వాటర్‌ కానన్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. ఈ విమానంతో ఎయిరిండియా విమానాల సంఖ్య 138కి చేరింది. ఈ ఏడాది మొత్తం 14 నియో ప్లేన్స్‌ను తీసుకుంటున్నట్లు ఎయిరిండియా సీఎండీ అశ్విన్‌ లొహానీ వెల్లడించారు. ఎయిరిండియా 2019 మార్చి నాటికి 29 నియో విమానాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈ తరహా విమానాలు ఇండిగో, గో ఎయిర్‌లకు ఉన్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy