లీడరమ్మ.. లీడరయ్య.. కొట్టుకున్నారు

WEB IMGమెడపట్టి తోస్తే అంతదూరంలో పడింది ఆమె. తనేం తక్కువనుకుందో ఏమో… ఎగిరితన్నింది. ఇద్దరి మధ్య ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ….  ఆ లేడీ… ఈ లీడర్ ఇద్దరూ ఒకరినొకరు తోసుకోవడం… కొట్టుకోవడం… బూతులు తిట్టుకోవడం వరసగా జరిగిపోయాయి. నువ్వొకటంటే నేను నాలుగంటా అన్న స్టైల్లో.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎవరు ఆపుతున్నా ఆగక… అలా ఇద్దరూ జనం మధ్యే ఫైటింగుకు దిగారు. ఈ ఇన్సిడెంట్… కేంద్రపాలిత ప్రాంతం డయ్యూడామన్ లో జరిగింది. ఆమె పేరు రూపాసింగ్. డామన్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బీజేపీ కార్పొరేటర్. ఆ పెద్దమనిషి అదే పార్టీకి చెందిన లీడర్ నవీన్ పటేల్. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. పార్టీ సమావేశానికి వచ్చిన ఈ ఇద్దరూ… ఒకరిని మరొకరు తిట్టుకోవడం.. కొట్టుకోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవన్నీ సీసీ కెమేరాలకు చిక్కాయి. ఇప్పుడివి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అసలే బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్లతో ఆ పార్టీ అగ్రనాయకత్వం తల పట్టుకుంటుంటే… గల్లీల్లోని ఈ లీడర్ల నిర్వాకం మరింత తలనొప్పిగా మారిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకూ వాళ్లిద్దరూ ఎందుకు కొట్టుకున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియదు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy