లీవ్ టీడీపీ..సేవ్ బీజేపీ: అమిత్ షా సభలో వ్యతిరేక గళం

111దేశంల గత 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధిని.. మూడేళ్లల్లోనే చేసి చూపించినామన్నారు.. బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్ షా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటున్నవారు.. రాష్ట్రానికి వాళ్లు చేసిన అన్యాయం కూడా చెప్పాలని కాంగ్రెస్ లీడర్లను విమర్శించారు. విజయవాడలో జరిగిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళానికి ముఖ్యఅతిథిగ హాజరైయ్యారు అమిత్ షా. ప్రత్యేక హోదా కంటే.. ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నామన్నారు. ఇప్పటీకే ఆంధ్రాకు లక్షా 75 వేల కోట్ల ఆర్థికసాయం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టేందుకయ్యే మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. జూలైలో మోడీ ఏపీలో పర్యటిస్తారని.. పండుగ వాతావరణంలా స్వాగతం చెప్పాలన్నారు.

ఏపీలో బీజేపీ మరింత బలపడేట్టు చేయాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. మోడీ అంటే మంచి పాలనకు మారుపేరన్నారు. దేశం మొత్తం బీజేపీ, మోడీ దిక్కే చూస్తుందన్నారు. కార్యకర్తలు బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు వెంకయ్య.

కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతుండగా.. లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అనే కార్డులను ప్రదర్శించారు కొందరు కార్యకర్తలు. వాళ్లను పోలీసులు బయటికి తీసుకుపోయారు. ఇకసభ జరిగే ముందు.. జనసేన కార్యకర్తలు ప్రత్యేకహాదా మీద మాటమార్చిన అమిత్ షా.. గో బ్యాక్ అని అందోళన చేశారు. ఇవి తప్ప మహాసమ్మేళన్ విజయవంతం అవడంతో.. ఫుల్ ఖుషీలో ఉన్నారు కమలం పార్టీ లీడర్లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy