లుంబినీ, గోకుల్ చాట్ జంట పేలుళ్లకు పదేళ్లు

blast-gokulలుంబినీపార్క్, గోకుల్‌చాట్‌ల్లో జంట పేలుళ్లు చోటు చేసుకుని శుక్రవారం (ఆగస్టు 25) నాటికి పదేళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 42 మంది ప్రాణాలు కోల్పోగా… మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.

సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్ లోజరిగిన పేలుడులో 9 మంది మరణించగా, కోఠి లోని గోకుల్ చాట్ దుకాణం దగ్గర జరిగిన పేలుడులో 33 మంది చనిపోయారు.

ఇండియన్‌ ముజాహిదీన్‌ (IM) ఉగ్రవాదులుగా తేల్చిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితులు.. ఎండీ సిద్దిఖ్ ఇస్సార్ అహ్మద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ షఫిఖ్ సయ్యద్, ఫారుఖ్ షర్ఫుద్దీన్ తార్కష్‌లను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పీటీ వారెంట్‌ పై ముంబై హైదరాబాద్‌ తీసుకువచ్చారు రాష్ట్ర ఆక్టోపస్‌ అధికారులు.

జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులనూ దర్యాప్తు చేసిన ఆక్టోపస్‌ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించి నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్, గోకుల్‌చాట్‌లో ఐస్‌క్రీమ్‌ డబ్బాపై బాంబు పెట్టిన రియాజ్‌ భత్కల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన అక్బర్‌లతో పాటు ఇక్బాల్‌ భత్కల్, ఐఎం ఫౌండర్‌ అమీర్‌ రజా ఖాన్, ఫారూఖ్‌ తర్ఖాష్, సాదిక్‌ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో రియాజ్, ఇక్బాల్, అమీర్‌ రజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

ఆక్టోపస్‌ను పూర్తి స్థాయి కమాండో ఫోర్స్‌గా మార్చిన తర్వాత ఈ కేసుల్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌కు బదిలీ చేశారు. IM ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో… ఆయా అధికారులు వారిని తీసుకువెళ్ళడం, తీసుకురావడం జరుగుతోంది. ఈ క్రమంలో కేసు విచారణ ఆలస్యమవుతోంది.

వరుస బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన బాధితులకు ..పదేళ్లు అవుతున్నా ఇప్పటి ఎలాంటి సహాయం అందలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy