లెక్క తేలింది : రాష్ట్రంలోని మెుత్తం పంచాయితీలు 12 వేల 751

telangana
రాష్ట్రంలోని కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. శనివారం(ఏప్రిల్-21) జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యను విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నట్లు తెలిపింది. అధికంగా నల్లగొండ జిల్లాలో 844, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో తక్కువగా 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండేవి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 300 మంది కంటే తక్కువ జనాభా ఉన్న ఊర్లు కూడా సైతం గ్రామ పంచాయతీలుగా మారాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్ని మాత్రమే గ్రామ పంచాయితీలుగా ఉండేవి.  ప్రస్తుత గణాంకాల ప్రకారం 300 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయితీలు 26 ఉన్నాయి. 210 నుంచి 230 మంది ఓటర్లు ఈ గ్రామాల్లో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఐదుగురు వార్డు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు ఉపసర్పంచ్‌గా ఎన్నిక అవుతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy