ఐటీ స్పెషల్ : సిటీలో ‘షీ షటిల్’ బస్సులు

BUSరాచకొండ పోలీసు కమిషనరేట్ ఐటీ కారిడార్‌లో ఐటీ ఉద్యోగినుల సురక్షిత ప్రయాణం కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో రాచకొండ పోలీసులు ‘షీ షటిల్’ బస్సు సర్వీసును బుధవారం(ఆగస్టు-16) ప్రారంభించనున్నారు. ఈ ‘షీ షటిల్’ సర్వీసులు ఎల్బీనగర్ నుంచి పోచారం ఐటీ కారిడార్ వరకు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ ఉద్యోగినులకు వారి ప్రయాణంలో భద్రత మరింత పెరగనుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ఐటీ కారిడార్‌లో దాదాపు 20 వేల మంది మహిళ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ బస్సు సర్వీసుల ప్రారంభోత్సవానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యలు హాజరవుతారన్నారు. అవసరమైన వారందరికీ ‘షీ షటిల్’ సర్వీసు బస్సు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. సైబరాబాద్‌లో ఈ షీ షటిల్ బస్సు సర్వీసులను ప్రతి రోజు దాదాపు 1200 మంది మహిళ ఐటీ ఉద్యోగినులు ఉపయోగించుకోనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy