లైంగికంగా వేధిస్తున్నాడు..అందుకే కేసు పెట్టా : హీరోయిన్

koena_mitra_012_1024x768_omgiవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బాలీవుడ్‌ నటి, మోడల్‌ కోయినా మిత్రా ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. శనివారం ( జూలై-29) సాయంత్రం ఓ వ్యక్తి తనకి ఫోన్‌ చేసి ఒకసారి కలుస్తావా.. మాట్లాడాలి అంటూ అసభ్యకరంగా మాట్లాడాడని కోయినా చేసిన ఫిర్యాదులో ఉంది. గత వారం నుంచి దాదాపు 50 నెంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయని ఆ నెంబర్లు ముంబయికి చెందినవేనని తెలిపింది. ఈ కేసు విషయమై దర్యాప్తు ప్రారంభించామని త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 2009లో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘రోడ్‌’ సినిమాలోని‘ఖుల్లం ఖుల్లా’ పాటతో కోయినా బాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత హే బేబీ, అప్నా సప్నా మనీ మనీ, ముసాఫిర్‌ చిత్రాల్లో నటించింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy