లైఫ్ పార్ట్ నర్స్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి?

ఇద్దరిని ఒకటి చేసి ఒకరి కోసం ఒకరు జీవించేలా చేసేదే పెళ్లి.. పెళ్లి నాటి ప్రమాణాలు పంచుకున్నట్లే  ఆర్థికావసరాలను కూడా పంచుకుంటేనే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఇందుకోసం ఇద్దరు ఓ ప్లాన్ వేసుకోవాలి. పెళ్లైన కొత్తలో ఆదాయం..ఖర్చులపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ధిక బాధ్యతలను ఇద్దరూ  పంచుకోవాలి..అదేలాగో వెల్త్ మేనేజ్ మెంట్ లో తెలుసుకుందాం.

పెళ్లికి ముందు ఇద్దరి అభిప్రాయాలు..అలవాట్లు వేరు.. ఆదాయం..ఖర్చు చేసే విధానం వేరు వేరుగా ఉంటుంది. పొదుపు పెట్టుబడి విషయాల్లో సొంతంగానో లేక తల్లిదండ్రుల సూచనలనో పాటిస్తారు. పెళ్లైతేనే సీన్ మారిపోతుంది. అప్పటి వరకు ఒక్కరే ఖర్చు చేస్తే ఇప్పడు ఇద్దరి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనుకోని ఖర్చులు  కూడా పెరుగుతాయి. పైగా  పైళ్లైన ఏడాదికో రెండేళ్లకో కూతురో.. కోడుకో వచ్చేస్తాడు.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేకపోతే సంపాదన వృధా ఖర్చులకు పెట్టాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుకున్న లక్ష్యాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా..?

460692789పెళ్లైన తరువాత సాధ్యమైనంత తొందరగా మార్యేజి అయినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. విదేశాలకు వెళ్లాలనుకున్నా.. పెట్టబడులు.. ఆస్తులకు.. వారసత్వానికి సంబంధించి ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి.  ఒకరి పేరు మీద మరొకరు పవర్ ఆఫ్ అటార్ని కూడా తీసుకోవచ్చు.. దీని వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో నిర్వాహాణ సులభం అవుతుంది.

వివాహానికంటే ముందు ఇద్దరి ఆదాయాలు..బ్యాంక్ అకౌంట్లు వేరు వేరుగా ఉంటాయి. పెళ్లి తరువాత వీటిని కలపాలా వద్దా అనే దానిపై చాలా మంది సందిగ్ధంలో పడిపోతారు. దీనిపై కచ్చితంగా ఇలా చేయాలని రూల్ ఏమీ లేదు. అయితే వీటి గురించి భార్యా భర్తలిద్దరూ తెలసుకోవడంతో పాటు ఎవరి సంపాదన ఎంతా..ఎలా ఖర్చు చేయాలి .. ఎంత మేర సేవింగ్ చేయాలి.. ఇంటి అవసరాల కోసం ఎవరి ఆదాయాన్ని కేటాయించాలి అనేది ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం వల్ల సగం సమస్యలు మొదట్లోనే పరిష్కారమవుతాయి. భార్య భర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే.. ఎవరి జీతం ఎంతో ఇద్దరికీ తెలిసి ఉండాలి. అలా కాకుండా ఇద్దరిలో ఒకరే ఉద్యోగం చేస్తున్నా కూడా మరొకరికి సంపాదన ఎంతో తెలయడం మరింత ముఖ్యం.

డబ్బులపై పెత్తనం ఇద్దరికీ ఉండాలా..?

2205952800000578-0-image-a-116_1442363515876ఇద్దరిలో మనీ మేనేజ్ మెంట్ పై ఎవరి ఎక్కువ ఆసక్తి వుంటుందో వారే ఆ బాధ్యతను తీసుకోవాలి. అయితే ఎప్పటి కప్పుడు ఆదాయం ఖర్చుల గురించి జీవిత భాగస్వామికి చెప్పాలి. అనుకోని కష్టాలు వస్తే అప్పుడు ఒకరిని మరోకరు నిందించుకునేది తప్పుతుంది. సొంతిల్లు.. హనీమూన్ .. ఇలా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి చాలా కోరికలుంటాయి. ఈ కోరికలను తీర్చుకోవాలంటే ఇద్దరూ కలసి ఓ నిర్ణయానికి రావాలి. ఈ కలలను నిజం చేసుకోవాలంటే వాటికయ్యే ఖర్చెంతో ముందుగానే ప్లాన్ చేసుకుని అందుకనుగుణంగా డబ్బును సమకూర్చుకోవాలి.

పెళ్లైన మొదట్లో డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతుంది.. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఊహించడం అంత సులభం కాదు.. అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాల కోసం ఓ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నెలలకు సరిపోయే సొమ్మును ఈ ఫండ్ లో జమ చేయాలి. ఈ డబ్బును సులభంగా తీసుకునే విధంగా  బ్యాంక్ సేవింగ్ ఖాతాలోనో.. లిక్విడ్ పండ్స్ లో సేవింగ్ చేయాలి. ఉద్యోగ భద్రత కూడా అంతంత మాత్రమే.. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మానేయాల్సి వస్తే కొత్త ఉద్యోగం వెతుక్కునే వరకు కొంత సమయం పట్టవచ్చు. ఈ లోపు వచ్చే ఖర్చులను అధిగమించాలంటే  కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది.. ఒకరి జీతంపైనే కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న ఫండ్ నుంచి కొద్ది కొద్దిగా డబ్బును అవసరాలకు వాడుకోవాలి.

వస్తున్న ఆదాయమెంత.. అవుతున్న ఖర్చెంత.. అనే దానిపై కచ్చితమైన అవగాహాన ఇద్దరికి ఉండాలి.. వీటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకోవడం వల్ల వృధా ఖర్చులను తగ్గించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందుతో  పోలిస్తే.. పెళ్లైన తరువాత కొత్తగా కుటుంబ బాధ్యతలు వస్తాయి. దీని కోసం ఇంటి బడ్జెట్  ను తయారు చేసుకోవడం చాలా అవసరం. ఇలా తయారు చేసుకున్న బడ్జెట్లో ఎప్పుడు మిగులు ఉండేలా చూసుకోవాలి.. మిగిలే మొత్తాన్ని భవిష్యత్తులో కోనబోయే కారు.. ఇల్లు లాంటి వాటికి వినియోగించవచ్చు.

బీమాపాలసీలున్నాయా..?

పెళ్లికి ముందు బీమా పాలసీల అవసరం గురించి చాలా మంది పట్టించుకోరు. కాని పెళ్లైన తరువాత ఇద్దరూ బీమాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.. సరైన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోవడానికి  లో ప్రీమియం.. హై రిస్క్ ఉండే పాలసీలనే తీసుకోవాలి.  ఒక వేళ జీవిత భాగస్వామి హౌస్ వైఫ్ అయినా ఆమె పేరు మీద బీమా పాలసీ  తీసుకోవాలి.  దీంతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కూడా తీసుకోవాలి. వీటికి ఫిజికల్ డిజేబిలిటీ.. క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ వంటి వాటిని యాడ్ చేసుకోవాలి.

సొంతంగా ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు ..ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఓ ఫ్లాట్ కొనుక్కోవాలంటే కనీసం 40 లక్షలు కావాలి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా కనీసం 10 లక్షలు చేతినుంచి పెట్టుకోవాల్సిందే. కారు కొనుక్కోవాలంటే కనీసం 6 నుంచి 8 లక్షలు ఉండాలి. వీటితో పాటు పిల్లల చదువు.. వారి పెళ్లిల్లు.. రిటైర్మెంట్ ఇలా చాల అంశాలుంటాయి. అవసరం ఏదైనా దాన్ని సాధించుకోవాలంటే.. సంపాదించడం ఒక్కటే మార్గం కాదు..సంపాదనలో మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి.  నేషనల్ సేవింగ్ స్కీమ్స్, బ్యాంక్ టర్మ్ డిపాజిట్లు,  గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు,  ప్రాపర్టీ వంటి వాటిలో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి.

జీవితం ఎప్పుడు ఒకేలా సాగిపోతుందనుకోవడం పొరపాటే.. పెళ్లైన కొత్తలో ఉండే అవసరాలు..బాధ్యతలు.. వయస్సుకు అనుగుణంగా మారిపోతుంటాయి.. ఉద్యోగంలో మార్పు.. పెరిగే ఖర్చులు..ఇలా ప్రతీ స్టేజిలో మీ ఫైనాన్షియల్ ప్లాన్ మారుతూ ఉండాలి. మీ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలో సమస్యలు వస్తే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సంప్రదించడం బెటర్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. మొత్తం ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా ఉండాలో వాళ్లు సలహా ఇస్తారు. ఇదీ వీలు కాక పోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ పై ఎన్నో వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి నుంచి మీకవసరమై సమాచారం తీసుకుని మీ పర్సనల్ ఫైనాన్స్ ను పక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy