‘లోకల్’ ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ కసరత్తు

handలోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సత్తాచాటేందుకు కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. మొత్తం 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ ఉండగా.. అన్ని స్థానాలకు పోటీ చేయాలని పీసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలుచుకోవటంతో.. స్థానిక కోటాలోనూ కాంగ్రెస్ కు ఆశలు చిగురిస్తున్నాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే.. కాంగ్రెస్ స్థానిక సంస్థల కోటాలో గెలిచే అవకాశం ఉంది. కానీ.. ఖమ్మం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు నేతలు. ఇప్పటికే ఏపీలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోనూ మరో వారంపది రోజుల్లో ఎలక్షన్ డేట్ ఫిక్సయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అధికార పార్టీ కన్నా.. కాంగ్రెస్ కే ఎక్కువ మంది ఎంపీటీసీలున్నారు. జెడ్పీటీసీలు టీఆర్ఎస్ కు అధికంగా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల తర్వాత కూడా.. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ గెలుచుకునే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

లోకల్ బాడీ ఎమ్మెల్సీ టికెట్లకు కాంగ్రెస్ లో ఫుల్ గిరాకీ ఉంది. లీడర్లంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఆయనకు టికెట్ రాకుండా.. ఆయన వ్యతిరేకులు అంతే సీరియస్ గా ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు.. పార్టీ వర్గాల్లో విన్పిస్తున్నాయి. సీఎల్పీ లీడర్ జానారెడ్డి.. తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని టాక్.

రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ హోంమంత్రి సబిత, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తీవ్రంగా పోటీపడుతున్నారు. మెదక్ నుంచి సునితా లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ.. వరంగల్ జిల్లా నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల కోడలు వైశాలి.. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీనర్సింహారావు, సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి.. ఖమ్మం నుంచి వనమా వెంకటేశ్వర్ రావు.. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీలు మల్లు రవి, విఠల్ రావు.. డీకే అరుణ అనుచరుడు చల్లా రామకృష్టారెడ్డి, శ్రీనివాస్ గుప్తా అనే ఓ వ్యాపార వేత్త టికెట్ కోసం ట్రైచేస్తున్నారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని.. గులాబీపార్టీ తమవైపు తిప్పుకోవటంతో.. వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సత్తాఉన్న అభ్యర్థులను బరిలో దించి.. అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy