ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం

ChidLokSabha295
సీమాంధ్ర మంత్రుల నిరసనల మధ్యే లోక్ సభ సమావేశాలు మొదలయ్యాయి. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ వెల్ లోకి వెళ్ళి ఆందోళనలు చేపట్టారు. నిరసనల మధ్యే కేంద్ర ఆర్ధి మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

2014-15 ప్రణాళికా వ్యయం 5,55,322 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 12,07,892 కోట్లు
ద్రవ్యలోటు 4.6 శాతానికే పరిమితం
1999-2004 నాటికి జీడీపీ వృద్ధిరేటు 5.9 శాతం
2004-2009 నాటికి జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం
ప్రపంచ ఆర్ధి వ్యవస్థ మందగమనంలో ఉంది.
భారత ఆర్ధిక వ్యవస్థ మూలాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయి.
జనవరి చివరికి ద్రవ్యోల్బణం 5.5 శాతం
2013-14 నాటికి 255 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి.
2013-14లో 7లక్షల 35 వేల కోట్ల వ్యవసాయ రుణాలు
2011-12 నుంచి ఆర్ధిక సంవత్సరం నుంచి ఆర్ధిక మందగమనం ప్రారంభం
గత పదేళ్ళల్లో అంచనాల కంటే భారీగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి.
దిగాలుపడిన పారిశ్రామికోత్పత్తి సూచీలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆందోళన కలిగిస్తోంది.
పదేళ్ళ క్రితం దేశంలో మొత్తం విద్యుదుత్పత్తి 20 లక్షల మెగావాట్లు, ప్రస్తుతం 2 లక్షల 44 వేల మెగావాట్లకు ఉత్పత్తి పెరిగింది.
దేశంలో మరో మూడు తయారిరంగ పారిశ్రామిక జోన్ లు
ఉన్నత విద్యకు 79, 459 కోట్ల కేటాయింపు
వైద్య రంగానికి 36, 300 కోట్ల కేటాయింపు
ఆహార భద్రత బిల్లును అమల్లోకి తెచ్చాం
3.80 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల అభివృద్ధి.
మీడియం, స్మాల్ మైక్రో ఎంటర్ ప్రైజెస్ కోసం రూ.100 కోట్లు
కమ్యూనిటీ రేడియో స్టేషన్ల కోసం రూ.100 కోట్లు
ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్, ఉత్తరాఖండ్ అభివృద్ధికి..
అదనంగా రూ.1200 కోట్లు కేటాయింపు
నిర్భయ చట్టం కోసం రూ. వెయ్యి కోట్లు
యువకుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ. వెయ్యి కోట్లు..
అంతరిక్ష పరిశోధనల కోసం అదనపు సాయం
2014-15లో రూ. 5,55,320 కోట్ల ప్రణాళిక వ్యయం
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 48,638 కోట్లు
27 పథకాల లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ
2.9 కోట్ల మంది వినియోగదారులకు..
రూ. 3,370 కోట్ల ఎల్పీజీ సబ్సిడీ ఇచ్చాం
ప్రణాళిక వ్యయం పూర్తిగా ఖర్చు చేయలేకపోవచ్చు..
మహిళా శిశు సంక్షేమానికి రూ.21 వేల కోట్లు
ఇందన సబ్సిడీకి రూ. 65 వేల కోట్లు
ఆహార సబ్సిడీకి రూ. లక్షా 15 వేల కోట్లు..
రక్షణ రంగానికి నిధుల కేటాయింపు 10% పెంపు..
భద్రతా దళాల్లో ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్ అమలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో..
రూ. 7 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.8 లక్షల కోట్లు..
మైనార్టీలకు రూ. 2,11,450 కోట్ల రుణాలు
పంచాయతీ రాజ్ కు రూ. 7 వేల కోట్లు
హౌసింగ్ రంగానికి రూ. 6 వేల కోట్లు కేటాయింపు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 11020 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల కోసం అదనంగా రూ.1200 కోట్ల కేటాయింపు
భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్డీఐ విధానాలను సరళీకరించాం
జాతీయ సోలార్‌ మిషన్‌ కింద 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులు
జనవరి నాటికి క్లియర్‌ చేసిన 296 ప్రాజెక్టుల విలువ: రూ.6.6 లక్షల కోట్లు
57 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ చేశాం
బొగ్గు ఉత్పత్తి 554 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది
గడిచిన పదేళ్లలో సగటున బొగ్గు ఉత్పత్తి: 361 మిలియన్‌ టన్నులు
2014-15లో సబ్సిడీలు: రూ.2.65 లక్షల కోట్లు
2014-15లో ఫుడ్‌ సబ్సిడీ అంచనా: రూ.1.15 లక్షల కోట్లు
నిర్భయ ఫండ్‌కు అదనంగా రూ.100 కోట్లు
2014-15లో ఇంధన సబ్సిడీ: రూ.65 వేల కోట్లు
ఈ ఏడాదికి చెందిన రూ.35 వేల కోట్ల ఇంధన సబ్సిడీని వచ్చే సంవత్సరానికి రోల్‌ ఓవర్‌ చేస్తాం
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.33,725 కోట్లు
పీఎస్యూ బ్యాంకుల్లో క్యాపిటల్‌ పెట్టుబడి: రూ.11,200 కోట్లు
రక్షణ శాఖకు: రూ.2.24 లక్షల కోట్లు, గతంలో: రూ.2.04 లక్షల కోట్లు
2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.8 లక్షల కోట్లు
మైనార్టీ వ్యవహారాల శాఖకు: రూ.3,711 కోట్లు
ట్యాక్స్‌ శ్లాబులో ఎలాంటి మార్పు లేదు
క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌లకు ఎక్సైజ్‌ సుంకం 2 శాతం తగ్గింపు

ఈ సారి బడ్జెట్ లో మరో 3 ఇండ్రస్టియల్ కారిడార్లను కేటాయించారు. చెన్నై-బెంగుళూరు, బెంగళూరు-ముంబాయి, అమృత్ సర్-కోల్ కత్తా మధ్య కారిడార్లను నిర్మిస్తామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం. దేశంలో జీడీపీ పెరిగిందన్నారు Q3,Q4 నెలల్లో 5.2% గా ఉందన్నారు.
ఇక ఎడ్యుకేషన్ కోసం 10,145 బడ్జెట్ ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వం ఆధార్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉందన్నారు. ఆధార్ లింక్ గ్యాస్ కు హామీ ఇచ్చినా కొంత కాలం దాన్ని నిలిపేశామన్నారు చిదంబరం. కల్పకంలో 500 మెగా వాట్ల న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దేశంలో 7 న్యూక్లియర్ రియాక్టర్ల పనులు జరుగుతున్నాయని, వాటిని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని సభలో తెలిపారు. నేషనల్ సోలార్ మిషన్ నాలుగు ఆల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాదిలోపు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలకు ఈ ఏడాది లోపు రూ.1200 కోట్లను రిలీజ్ చేస్తామన్నారు. రూ.1000 కోట్లను నిర్భయా చట్టానికి కేటాయించామన్నారు. ఆయిల్ కోసం ప్రభుత్వం 65 వేల కోట్ల సబ్సిడీని భరించింనట్లు చిదంబరం తెలిపారు. రూ.1.15లక్షల కోట్లను ఆహార భద్రత కోసం కేటాయించామన్నారు. కేంద్రం నుంచి 2.1 కోట్లమంది ఎల్పీజీ కష్టమర్లకు రూ.3,370 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశామన్నారు.
ఢిఫెన్స్ బడ్జెట్ ను ఈ ఏడాది 10 శాతం పెంచామన్నారు. దీని కోసం రూ.2.24 లక్షల కోట్లు కోటాయించామన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy