లోక్ సభలో ‘నేషనల్ హెరాల్డ్’ గందరగోళం

the-parliamentనేషనల్ హెరాల్డ్ ఇష్యూతో లోక్ సభ గందరగోళంగామారింది. విపక్ష సభ్యులను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ఖర్గే. బీజేపీ ఎంపీలు,ముఖ్యమంత్రులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోని సర్కార్.. అపోజిషన్ పార్టీలపై అమానుషంగా వ్యవహరిస్తోందని ఫైరయ్యారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టే ముందు… వీకే సింగ్ వ్యవహారంపై సమాధానం చెప్పాలన్నారు. దీంతో అధికార విపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. ఖర్గే.. కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఫ్రస్టేషన్ తోనే సభలో ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని వివరణ ఇచ్చారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy