లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసిన టీ-ఎంపీలు..

లోక్ సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 17 మందిలో 15 మంది ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుండి నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు. నంది ఎల్లయ్య హిందీలో ప్రమాణం చేయగా, గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కడియం శ్రీహరి, బాల్క సుమాన్, కవిత,  డా.బూర నర్సయ్య గౌడ్,  ప్రొ.అజ్మీరా సీతారాం నాయక్, గోదం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.  బి.బి.పాటిల్, ప్రొ. సీతారాం నాయక్ లు గైర్హాజరయ్యారు. టీడీపీ నుండి మల్లా రెడ్డి, వైసీపీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ, ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లు ప్రమాణం చేశారు.

asaduddin owaisi balka suman dattartreya jitendar reddy kadiyam srihari kavita sukhendar reddy vinod kumar

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy