లోక్ సభ: విపక్షాల గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.  లోక్‌సభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్క సభ్యుడు ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు నమస్కరించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. విపక్షాల నినాదాలు..గందరగోళం మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, న్యాయం చేయాలంటూ ఆ రాష్ట్ర టీడీపీ ఎంపీలు నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దీంతో లోక్ సభ హోరెత్తుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వారు పట్టుబట్టారు. ఏ అంశంపై అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాతే చర్చకు అనుమతిస్తానని స్పీకర్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy