లోన్ తీసుకుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్

house-loanబ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవాలంటే ఇంతకు ముందు చాలా కష్టపడాల్సి వచ్చేది. బ్యాంకుల చుట్టూ తిరగాలి.. బ్రోకర్లను పట్టుకోవాలి.. కమిషన్ లు ఇచ్చి రుణం తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు అది మారుతోంది. బ్యాంకులే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చి మరీ రుణాలు ఇచ్చే స్థాయికి వచ్చాయి. ఆన్ లైన్ లో కొంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చినట్టు బ్యాంకులు లోన్ తీసుకుంటే ఇస్తున్నాయన్న మాట. అంతేకాదు పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలిచ్చేస్తున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన ఆఫర్ ఆ కోవకే చెందినది. హౌజ్ లోన్ తీసుకున్న వారికి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ పథకాన్ని ప్రకటించింది. కొత్త పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకు హౌజ్ లోన్ పొందేవారితో పాటు, వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 20 శాతం వరకూ లేదా రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డును వినియోగించి రూ.30,000 కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30, 2017 వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

.. హౌజ్ లోన్ పొందిన మూడు నెలల్లోగా క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు.
..  ఒక కార్డుకు ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.
.. పథకం అందుబాటులో ఉన్న సమయంలో హౌజ్ లోన్ పొందటంతో పాటు, సదరు వినియోగదారుడు క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా రూ.30వేల లావాదేవీ జరపాల్సి ఉంటుంది.
..  ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు.. వేతనం పొందే వారిలో మహిళలకు 8.35 శాతం, మిగిలిన వారికి 8.40శాతం వడ్డీకి గృహరుణాలను అందిస్తుండగా, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy