లోయలో పడ్డ ట్రక్కు…20 మంది మృతి

నేపాల్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 20 మంది మృతి చెందగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న(శుక్రవారం) సాయంత్రం నువాకోట్ లోని కిమ్ తాంగ్ నుంచి సిసిపు వెళ్తున్న ఓ ట్రక్కు గయాంగడండా ప్రాంతంలో అదుపు తప్పి సుమారు 100 మీటర్ల లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఖాట్మండు హాస్పటల్ కు తరలించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ట్రక్కు అదుపు తప్పిందని పోలీస అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది మృతదేహాలను వెలికితీశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy