ల్యాప్ టాప్ లపై అమెరికన్ ఎంబసీ నిషేధం

HP-Laptopదేశంలోని తమ కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లను తీసుకురావడంపై నిషేధం విధించింది అమెరికన్ ఎంబసీ. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతాల్లోని అమెరికా కేంద్రాల్లోకి నెట్‌బుక్స్‌, క్రోమ్‌బుక్స్‌, ఐపాడ్స్‌, కిండిల్స్‌, మాక్‌బుక్స్‌ సహా లాప్‌టా్‌పలు, టాబ్లెట్లను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటన్నది అమెరికా ఎంబసీ వెల్లడించలేదు. అన్ని రకాల ఎలక్ర్టానిక్‌ వస్తువులను తీసుకురావడాన్ని చెన్నై అమెరికన్‌ సెంటర్‌లో ఇప్పటికే నిషేధించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా కార్యాలయాల్లోకి మొబైల్‌కి మినహాయింపు ఇచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy