వందనం.. అభి’వంద’నం: నింగికేగనున్న వందో శాటిలైట్

satiliteభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయింది. తన వందో ఉపగ్రహాన్ని ఇవాళ నింగిలోపంపనుంది. ఉదయం 9 గంటల 28 నిమిషాలకు PSLV-C40ని స్పేస్ లోకి ప్రయోగించనుంది. దీని ద్వారా మొత్తం 31  శాటిలైట్లను  స్పేస్ లోకి  పంపుతుంది ఇస్రో.

ఈ ప్రయోగంలో ఏడో ఎర్త్ అబ్జర్వేటరీ కార్టోశాట్-2 సిరీస్ శాటిలైట్ కీలకం. దాంతోపాటు మనదేశానికి చెందిన ఓ మైక్రోశాటిలైట్.. మరో నానో శాటిలైట్ ని పంపుతోంది.  మన ఉపగ్రహాలతో పాటు ఆరు దేశాలకు చెందిన 28 శాటిలైట్లను స్పేస్ లోకి పంపనున్నారు. అమెరికా, ఫ్రాన్స్, ఫిన్ లాండ్, సౌత్ కొరియా, కెనెడాకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతున్నారు. PSLV-C40 పేలోడ్ 1323 కేజీలు. గతేడాది అగస్ట్ 31న ప్రయోగించిన PSLV-C39 ఫెయిలవడంతో… ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.

భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్‌ చిత్రాలను అందించడం కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత. కార్టోశాట్‌-2 శ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్‌క్రొమాటిక్‌, మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరాలు ఉంటాయి. హై రిజల్యూషన్‌ డేటాను అందించడంలో వీటికి తిరుగులేదు. పట్టణ, గ్రామీణ ప్రణాళిక; తీర ప్రాంత వినియోగం, నియంత్రణ; రోడ్డు నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ; భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy