వచ్చేసింది: మార్కెట్లోకి రూ.200 నోట్లు

200మొదటి సారిగా  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో 200 రూపాయల డినామినేషన్‌ కరెన్సీ నోట్లను రిలీజ్ చేయనుంది. శుక్రవారం (ఆగస్టు 25) వినాయక చవితి రోజే ఈ కొత్త నోట్లను జారీ చేస్తున్నారు. మహాత్మా గాంధీ కొత్త సీరిస్‌లో RBI గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో జారీ చేస్తున్న ఈ కొత్త నోట్లు పసుపు రంగులో ఉంటాయి. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక రంగంలో నగదు కొరత తీవ్రంగా ఉంది.

కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చినప్పటికీ తక్కువ డినామినేషన్‌ కరెన్సీ లభ్యత సమస్య తీవ్రంగా ఉంది. 100 రూపాయల నోట్లకు డిమాండ్‌ పెరగడంతోపాటు కొరత కూడా మొదలైంది. ఈ క్రమంలో 200 రూపాయల నోట్లతో తక్కువ డినామినేషన్‌ కరెన్సీ కొరత తీరే అవకాశం ఉంది. 200 రూపాయల నోట్ల జారీకి అనుమతినిచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే RBI కొత్త నోట్లను ప్రవేశ పెడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన కొత్త కరెన్సీ నోట్లన్నీ రంగురంగుల్లో, ఆకర్షణీయమైన డిజైన్లలో ఉన్నాయి. మెజంటా బేస్‌ కలర్‌గా ఉన్న 2000 నోటు తర్వాత బూడిద వర్ణంలో 500 నోటు తాజాగా తేట పసుపు వర్ణంలో 200 నోటును జారీ చేస్తున్నారు. సెక్యూరిటీ ఫీచర్స్‌ అన్నీ పకడ్బందీగా ఉన్న 200 రూపాయల కొత్త నోటుపై ఉన్న ఇతర డిజైన్లు , జామెట్రిక్‌ పాటర్న్స్‌ కలర్‌ డిజైన్‌లో కలిసిపోయేట్టుగా ఉన్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ శుక్రవారం (ఆగస్టు25)న ఎంపిక చేసిన కొన్ని RBI  శాఖలు, బ్యాంకుల ద్వారా 200 నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ నోట్లు ఇప్పుడిప్పుడే ATM ల ద్వారా చలామణిలోకి రాకపోవచ్చు. ఈ డినామినేషన్‌ పూర్తిగా కొత్త కావడం… ఈ నోటు సైజులోనే తేడా ఉండటంతో ATM ల రికాలిబ్రేషన్‌ అవసరం ఉంది. దీనికి మరి కొంత టైం పడుతుంది.

200 నోటుతో భారత్‌లో చలామణిలో ఉండే కరెన్సీ నోట్లు 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 డినామినేషన్‌లో ఉంటాయి. ఇప్పటి వరకు 100 తర్వాత 500 నోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మధ్యలో ఒక డినామినేషన్‌ మిస్‌ అయిందన్న భావన ఉండేది. ఇప్పుడు 200 నోటును ‘మిస్సింగ్‌ మిడిల్‌’’ అనినిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 500 రూపాయలకు 2000కు మధ్య కూడా మరో డినామినేషన్‌ లేకపోవడంతో సాధారణ ప్రజలు లావాదేవీల్లో ఇబ్బందులు పడుతున్నారు. 200 నోటుతో ఈ ఇబ్బందులు తగ్గుతాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy