వచ్చేసింది : మోడల్ నంబరే.. మొబైల్ రేటు

PHONEనోకియా ఈజ్ బ్యాంక్ అంటూ.. తొలితరం మోడల్ 3310కు మరిన్ని హంగులు అద్దింది కంపెనీ. మే 18వ తేదీన ఇండియాలో లాంజ్ కాబోతున్న ఈ మోడల్ ఫోన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ ధరను ఫిక్స్ చేసింది కంపెనీ. మోడల్ నంబర్ నే.. ధరగా ఫిక్స్ చేసింది. అంటే ఇండియాలో దీని ధర రూ. 3310. అన్ని ప్రధాన స్టోర్లలో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్. ప్రపంచవ్యాప్తంగా భారత్ అతిపెద్ద మార్కెట్ అని అంచనా వేస్తోంది. పాత ఫోన్ కు కొత్త మార్పులు చేశారు.

నోకియా 3310 ప్యూచర్స్ ఇలా ఉన్నాయి.

16MB RAM, 2.4 అంగుళాలు స్కీన్, కలర్ డిస్ ప్లే, స్క్రీన్ పై కర్డ్వ్ గ్లాస్, 1200 MAH బ్యాటరీ (22 గంటల టాక్ టైం), FM రేడియో, మ్యూజిక్ ప్లేయర్ ఆప్షన్స్ ఇచ్చారు.

16GB ఫోన్ స్పేస్ తోపాటు 32GB ఇంటర్ననల్ SD కార్డ్ స్పేస్ కు అవకాశం ఉంది.

LED ప్లాష్ తో 2MP కెమెరా

బ్రౌజింగ్ ఆప్షన్ ఉన్నా.. యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఫోన్ లో ఉన్న యాప్స్ మాత్రమే వాడుకోవాలి.

బ్లూ, ఎల్లో, రెడ్, గ్రే నాలుగు కలర్స్ లో రిలీజ్ అవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy