వచ్చే అకాడమిక్ నుంచే బీసీ గురుకులాలు: జోగు

BC-gurukulవచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వీటి ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన బీసీ గురుకులాల్లో.. రానున్న అకడమిక్ ఇయర్ నుంచే తరగతులు మొదలు పెట్టాలన్నారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తయ్యేంతవరకు అద్దె భవనాల్లో తరగతులు నిర్వహించాలని సూచించారు. హాస్టల్లో విద్యార్థులు తక్కువగా ఉంటే.. దగ్గర్లోని మరో హాస్టల్ కు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. బీసీ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి.

ఇక కల్యాణలక్ష్మి పథకం అమలు తీరుపైనా మంత్రి జోగు రామన్న సమీక్షించారు. పథకాన్ని సరిగా అమలు చేయాలన్న మంత్రి.. అధికారులు రెవెన్యూ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే.. దోభీ ఘాట్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. బీసీలకు ఉపాథి కల్పన పథకాలు సరిగా అమలు చేయడంతో పాటు… సమయానికి రుణాలు అందేలా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

ఎకో టూరియం అభివృద్ధి పనులు.. మూడో విడత హరితహారంపైనా మంత్రి జోగు రామన్న దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఎకో టూరిజానికి చాలా అవకాశాలున్నాయన్న మంత్రి.. యూకలిప్టస్ చెట్ల పెంపకంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే కోతదశకు వచ్చిన యూకలిప్టస్ చెట్లను.. బహిరంగ వేలంలో అమ్మాలన్నారు. మరిన్ని యూకలిప్టస్ చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. జులైలో మొదలు కానున్న మూడో విడత హరిత హారానికి.. 4 వేల 219 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలకు వీటిలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy