
ప్రస్తుతం అంజలి తరమణి, కాన్బదు పొయ్, పేరంబు, బెలూన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.వీటిలో బెలూన్ చిత్రంలో జయ్తో కలిసి నటిస్తున్నారు కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కిచెన్లో దోశ వేసి తింటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ డీప్లవ్లో ఉన్నట్లు కోలీవుడ్ కోడై కూసింది. అలాంటిదేమీ లేదని అంజలి-జై ఖండించారు.ఈ జంట సహజీవనం చేస్తున్నారని ఇప్పటికే వార్త ప్రచారంలో ఉంది. అంతే కాదు ఇద్దరూ పెళ్లికి సిద్ధం అవుతున్నారనేది తాజా ఖబర్. అంజలి జైతో ప్రేమ వ్యవహారాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి ఒప్పించినట్లూ, జై కూడా వెంటనే పెళ్లికి రెడీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ తమ చిత్రాలను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం