వచ్చే ఏడాది తమిళనాడులో ప్లాస్టిక్ నిషేధం

palanisamy-1సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2019 జనవరి 1 నుంచి పూర్తిగా తమ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇవాళ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.  ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తయారు చేయడం, వాడటం అన్నీ నిషేధమేనన్నారు.

‘తమిళనాడు 2019 నుంచి ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రారంభిస్తుంది’ అని రాష్ట శాసన సభలో ప్రకటించారు సీఎం పళనిస్వామి. పాలు, ఆయిల్‌ పౌచ్‌లు, మెడికల్‌ యుటిలిటీస్‌, ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు ఆయన. రూల్‌ 110  కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy