వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

kcrవచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని  నిర్ణయించారు  సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగానికి నిధులు కూడా భారీగా పెంచనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం – వ్యవసాయాభివృద్దిపై ప్రగతి భవన్ లో శనివారం (జులై1) సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ క్లస్టర్ లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మించనున్నట్లు చెప్పారు.

సంఘటిత శక్తిలో ఉన్న బలమేంటో రైతులకు వివరించి, వారిని సంఘటితం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచేందుకు అనుసరించాల్సిన ఆధునిక, శాస్త్రీయ పద్దతులపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మూడింట రెండు వంతుల మంది ఆధారపడిన వ్యవసాయరంగం మరింత విస్తరించాల్సి ఉందన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని, అవసరమైతే రిటైర్డ్ వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సేవలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. గ్రామాల్లో భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు, కల్తీ నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఈ భేటీకి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy