‘వజ్రాల పంట’పై రాయలసీమ వాసుల ఆశలు

60-People.jpg.image.975.568కర్నూల్ జిల్లా పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి తో పాటు అనంతపురం గుత్తిలో జనం చాలా బిజీ అయ్యారు. వర్షం కాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేటలో నిమగ్నమవుతారు. వానలు పడితే చాలు భూ పొరల్లో ఉన్న వజ్రాలు బయటకు వస్తాయని….వాటికోసం జనం ఎదురుచూస్తుంటారు. ఏటా వర్షాకాలంలో ఇక్కడ వజ్రాల వేట ప్రారంభంవుతుంది. వజ్రాలు దొరికి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. రెయిన్ సీజన్ లో పంటపొలాల్లో వజ్రాల కోసం గాలిస్తుంటారు ప్రజలు. పొలం మొత్తాన్ని తవ్వుకుంటూ ఒక్క వజ్రమైనా దొరకదా అనుకుంటూ ఆశ పడుతుంటారు. చెట్టు.. పుట్ట అన్నీ గాలిస్తారు. ముఖ్యంగా వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయని ప్రచారంలో ఉన్న తుగ్గలి మండలం జొన్నగిరి కొండలు, పొలాల్లో మకాం వేస్తారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ కూడా ఇక్కడకు 15 కి.మీ దూరమే ఉండడంతో ఇరుగు పొరుగు రాష్ర్టాల నుండి కూడా అనేక మంది తరలివచ్చి నెలల తరబడి వజ్రాల కోసం వెదుకుతుంటారు. వజ్రాల అన్వేషణ కోసం వచ్చే వారంతా సమీప గ్రామాల్లోని గుళ్లు, బళ్లలో నివాసం ఉంటూ నెలల తరబడి ఉంటారు. ఇక్కడి పొలాల్లో దొరికే రంగు రాళ్లు, వజ్రాల గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. రంగు రాళ్లు, వజ్రాలతోపాటు బంగారం నిక్షేపాలు కూడా అపారంగా ఉన్నట్లు తేలింది. బంగారు నిక్షేపాలు ఎంత మేరకు ఉన్నాయో నిర్ధారించేందుకు గత 15 ఏళ్లుగా సర్వే జరుగుతోంది.

ఈ సర్వ్ రిపోర్ట్ ఇంత వరకు బయటకు రాలేదు.  రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం ఇక్కడ ప్రజలు వజ్రాల కోసం సాగించే వేటను అంగీకరిస్తూనే ఇంత వరకు ఎవరికీ దొరికిన దాఖలాలు లేవంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న ఉదంతాలు తమ దృష్టికి రాలేదని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని అంటారు. బంగారు నిక్షేపాల గురించి సర్వే జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖ ఎవరికైనా వజ్రాలు దొరికితే..  ప్రభుత్వానికి అప్పజెబుతామంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy