వడోదరకు టాటా చెప్పేస్తున్న మోడీ…

Modi-nomination-PTIభారీ మెజారిటీతో గెలుపొందిన సొంత రాష్ట్రం వడోదరకు ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేస్తున్నారు. మోడీ వడోదర, వారణాసిల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రెండింటిలో ఏదో ఒక స్థానాన్నే ఎంచుకోవల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఈరోజు వడోదర స్థానానికి రాజీనామా చేయనున్నారు. వారణాసిని ఉంచుకోనున్నారు మోడీ. మోడీ తర్వాత వడోదర స్థానం ఎవరికి వెళుతుందనే దానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. మోడీ రైట్ హ్యాండ్ అయిన అమిత్ షా ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కరెంట్ మోడీ కేబినెట్ లో మినిస్టర్లగా న్న ఇద్దరు మంత్రులకు కూడా ఈ స్థానాన్ని కేటాయించవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రులైప స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ఏ నియోజకవరన్గం నుంచే గెలవలేదు. అయినా సరే కేంద్రమంత్రి పదవులను దక్కించుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరికోఒకరికి వడోదర స్థానాన్ని కేటాయించవచ్చని టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలియాలంటే మోడీ రాజీనామా అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy