వన్డేల్లో రోహిత్ శర్మ వాల్డ్ రికార్డ్ స్కోర్

12987వన్డే హిస్టరీలో రోహిత్ శర్మ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకూ ఏ బ్యాట్స్ మెన్ చేయనన్ని రన్స్ చేశాడు. 173 బంతుల్లో 264 రన్స్ చేసి వాల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకూ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరుమీద ఉన్న 219 రన్స్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 33 ఫోర్లు, 9 సిక్సులు కొట్టాడు. మ్యాచ్ ఓపెనింగ్ బాల్, చివరి బాల్ రోహిత్ శర్మనే ఆడాడు.  ఇక డబుల్ సెంచరీ విషయంలో మనోడు కాస్త ముందున్నాడు. రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ హిస్టరీలో నిలిచాడు. గతేడాది నవంబర్ 2న ఆస్ట్రేలియాపై 209 రన్స్ చేసిన రోహిత్, సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి డబుల్ సెంచరీని చేశాడు. ఇప్పటివరకూ వాల్డ్ లో డబుల్ సెంచరీలు చేసిన నలుగురు బ్యాట్స్ మెన్ కూడా ఇండియావాళ్ళు  కావడమే మరో రికార్డ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy