వన్నె తగ్గని అందం : సెక్సియస్ట్ వుమెన్ గా ప్రియాంకా చోప్రా

priyankaబాలీవుడ్ అందాలభామ ప్రియాంకచోప్రా 35 సంవత్సరాల వయసులోనూ వన్నెతగ్గని అందంతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఫోర్బ్ లిస్టులో అందమైన మహిళగా ఎంపికైన ఈ బ్యూటీ..లేటెస్టుగా ఆసియాకు చెందిన అత్యంత శృంగార మహిళగా కూడా నిలిచింది. బ్రిటన్‌లో నిర్వహించిన వార్షిక పోల్‌లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేసింది. లండన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని ఈస్ట్రన్ ఐ ఎడిటర్ తెలిపారు. ఇండియన్ టీవీ స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy