వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జనాల మధ్యే

IndiaTvfa7ac0_bjp_celebrationఇక జనాల్లోకి బీజేపి..!!

నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్

ఒక్కో మంత్రి కొన్ని ఏరియాలకు

వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది మోడీ సర్కార్. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్ నిర్వహించనుంది. ఈ ఏడాదిలో కేంద్రం చేసిన పనులు, పథకాలను జనానికి వివరించేందుకు మంత్రులు, బీజేపీ నేతలు రెడీ అయ్యారు. ఇవాళ్టి నుంచి నెలాఖరు వరకు 200 భారీ సభలు.. 5 వేల డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. టీవీల్లో పబ్లిసిటీ చేయడం కంటే… డైరెక్ట్ గా ప్రజల దగ్గరికే వెళ్లి.. ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పేందుకు మోడీ సర్కార్ స్కెచ్చేసింది. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ జనానికి ఏమీ చేయలేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు… మంత్రులు,  నేతలు దేశం చుట్టేసేలా కేంద్రం ప్లాన్ చేసింది. ఒక్కో మంత్రి కనీసం 2 నుంచి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా తిరిగి పాలనపై ప్రచారం చేసేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసింది.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్… కోల్ కతా,  జమ్మూ,  రాజ్ కోట్ లో పర్యటించనున్నారు. ఫారిన్ మంత్రి సుష్మా స్వరాజ్ భోపాల్,  డెహ్రూడూన్ వెళ్లి కేంద్ర పాలనపై ప్రచారం చేయనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. అహ్మదాబాద్,  అమృత్ సర్,  భోపాల్ లో జరిగే సభలకు అటెండ్ కానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు..  పుణె,  భువనేశ్వర్,  భిలాయ్ ను చుట్టేయనున్నారు. రక్షణ మంత్ర మనోహర్ పారికర్ కు.. రాయ్ పూర్,  చెన్నై,  ముంబై సభల బాధ్యతలను కేంద్రం అప్పజెప్పింది. ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్ నితిన్ గడ్కరీ.. పాట్నా, ఢిల్లీ,  ముంబై సభలకు అటెండ్ కానున్నారు. న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ.. త్రివేండ్రమ్, ఎర్ణాకులమ్, తిరుచూర్,  కొట్టాయం, అలెప్పీలో ప్రచారం చేయనున్నారు. జలవనరుల మంత్రి ఉమాభారతి మీరట్,  గుర్గావ్, పాట్నా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లనున్నరు. హెచ్చార్డీ మినిస్టర్ స్మృతీ ఇరానీ.. అమేథీ,  మిడ్నాపూర్,  సిల్చర్ ను విజిట్ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర మంత్రులు పర్యటించి.. మోడీ పాలనపై ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇవాళ ఢిల్లీ సభకు అటెండ్ కానున్న మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. రేపు,  ఎల్లుండి మన రాష్ట్ర సభలకు హాజరు కానున్నారు. ఇవాళ తిరుపతిలో జరిగే సభకు…కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రానున్నారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ ప్రచారంలో తలో చేయి వేసేందుకు ప్రిపేర్ అయ్యారు. వారం రోజుల పాటు… రక్తదాన శిబిరాలు.. పండ్లు, బట్టల పంపిణీ.. కాగడాల ప్రదర్శన కార్యక్రమాలు చేయనున్నారు. 30 రోజుల్లో దేశవ్యాప్తంగా 60 నగరాల్లో ప్రచార సభలు జరగనున్నాయి. సెంట్రల్ నుంచి స్టేట్ లీడర్స్ వరకు..అందరూ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy