వయ్యారి గాలిపటాలతో జర భద్రం..!

kitesకైట్స్ ఫెస్ట్ కి  టైం వచ్చేసింది. ఇప్పటికే గాలిపటాలు ఎగురుతున్నాయ్. సందడి మొదలైంది సరే… బాగానే ఉంది. కాకపోతే… బీకేర్ ఫుల్. సరదా తీరిపోతుంది. మీదే కాదు. మీ సరదాకి.. ఏ సంబంధమూ లేనోళ్ల సరదా కూడా తీరిపోవచ్చు. వాళ్లకీ ప్రాబ్లమవ్వొచ్చు. కావచ్చేంటి. అవుతోంది కూడా.

పండగొచ్చింది. సెలవులొచ్చినయ్. ఇంకా మరిన్ని సెలవులున్నయ్ ముందు ముందు. వీకెండ్స్ లో అయితే.. ఫుల్ జాలీ. అయితే.. కైట్సే కదా. గాల్లోకి పోతయ్. పోయేదేముంది. వచ్చే నష్టమేముంది అనుకోవచ్చు. కాపోతే వీటితో కూడా చాలా చాలా డేంజరుంది. కేర్లెస్ గా వదిలేస్తే.. చుట్టూ ఉన్న నలుగురిలో ఒకరో ఇద్దరో ఇబ్బందులు పడుతుంటారు. కాపోతే ఆ విషయం మన దాకా రాదు. గాలి పటం. చిన్న దారమే కదా అనుకోవద్దు. గాలిపటాలు ఎగరేసే టైంలో బోలెడు ప్రికాషన్స్ తీసుకోవాలి మస్ట్. ఇక చైనా నుంచొచ్చే.. ఉత్పత్తుల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలి. చైనావాళ్లు.. గాలి పటాలకి మాంజా దారం వాడుతుంటారు. ఇవి మామూలుగా తెగవు. గాలి పటాలతో గాల్లో జరిగే పోటీలకి ఇవి సూపర్. దారం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రత్యర్థి పటాన్ని పడగొట్టాలంటే.. మాంజా దారం స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే.. దీంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. చెట్ల కొమ్మల మధ్య చిక్కుకుంటే.. పక్షులకి ప్రమాదం. వాటికి తగిలి చనిపోయేవి కూడా బోలెడు. గాలి పటాల దారంతో మనుషులకి కూడా ప్రమాదమే. కైట్ కింది భాగంలో ఉండే దారానికి కెమికల్ వాడి తయారు చేసేవి కూడా ఉంటయ్. అవి కానీ మనుషులకి తగిలితే.. స్కిన్ కి గాయమవ్వొచ్చు. కాస్త బ్లడ్డొస్తుందిలే ఏముంది అనుకుంటే కష్టం. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెరగొచ్చు. కరెంట్ తీగల మీద పడితే.. షాకొచ్చే ఛాన్సుంది. ఎందుకంటే.. నైలాన్ దారానికి గ్లాస్ కోట్, రాగి వంటి పదార్థాలు వాడి దారం స్ట్రాంగ్ గా.. షార్ప్ గా ఉండేలా తయారు చేస్తున్నారు. మాంజా దారాన్ని నిషేధించాలనేది పర్యావరణ ప్రేమికుల మాట. మాంజాతో గాయపడిన పక్షులు ఎక్కడైనా కనిపిస్తే 1800-425-5364 అనే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలంటున్నారు అధికారులు.

పండుగ టైమ్.. పిల్లలు ఆడుకుంటారు అని అలా వదిలేయకుంటే బెటర్. వాళ్లు ఎక్కడ ఆడుకుంటున్నారు. అది సేఫ్ ప్లేసేనా కాదా చూడాల్సిన అవసరముంది. గాలి పటం పైకెగరాలి. పైకెగరాలి అని వీళ్లు పైపైకెళ్తుంటారు. బిల్డింగులు గుట్టలు ఎక్ ఆడుకుంటుంటారు. పిల్లల్దేముంది. పరుగెత్తుతుంటారు. ప్రమాదం పక్కనే ఉంటదనే విషయం వాళ్లకేం తెలుసు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy