వరంగల్ జిల్లాకు సీఎం వరాల జల్లు

KCR LIVEజిల్లా అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం వరంగల్ జిల్లా అన్నారు సీఎం కేసీఆర్. జిల్లా అభివృద్ధికి స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వరంగల్‌కు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై  అధికారులతో చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2-3వేల ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నారు సీఎం. టెక్స్‌టైల్‌ భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చే మూడు నాలుగేళ్లలో వరంగల్ నగరంలో 4.5 లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగూనంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

ఎడ్యుకేషన్ హబ్‌గా వరంగల్

కోరుకొండ స్థాయిలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. వరంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు కావాలని కోరారు. జిల్లాలో వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలతో పాటు ట్రైబర్‌యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్‌లో హైజెనిక్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మిషన్‌ భగీరథ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ పథకం కింద వరంగల్‌ జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు గోదావరి నీరు అందించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మిడ్ మానేరును గోదావరి నీటితో నింపడంతో పాటు.. దేవాదుల ప్రాజెక్టు నీటిని రామప్ప చెరువుకు అనుసంధానం చేస్తామని తెలిపారు సీఎం. రామప్ప చెరువు నుంచి లక్నవరం, ఘణపురంచెరువులకు నీరందిస్తామన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

12 అంతస్తులతో పోలీస్ కమిషనరేట్

వరంగల్ కలెక్టరేట్‌కు కొత్తగా మల్టీ స్టోరైడ్ బిల్డింగ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 12 అంతస్తులతో కొత్త పోలీస్ కమిషనరేట్ లేటెస్టు హంగులతో నిర్మిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌లో 200-300 ఎకరాల్లో థీమ్ పార్క్ నిర్మిస్తామని ప్రకటించారు. సెంట్రల్ జైలును మామునూరు ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీకి భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. వరంగల్, హన్మకొండలో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలో వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. జిల్లాలో అన్ని సదుపాయాలతో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం  కేసీఆర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy