వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

WGL KCRత్వరలోనే వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 15 శాతం ఆర్థికాభివృద్ధితో  రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. బడ్జెట్‌లో వరంగల్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇవి వరంగల్ కోట, కాకతీయులు నిర్మించిన చెరువులు పర్యాటకరంగ అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు సీఎం. రూ. 130 కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాకతీయ కాలువ మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కాలువ మరమ్మతులకు ఇంకా ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామన్న సీఎం… మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని ప్రతీ ఇంటికి మంచినీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

వరంగల్ నగరం లోపల, పరిసరాల్లో ప్రభుత్వ భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. వాటిలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. నగరంలోని ఆటోనగర్‌ను సిటీ అవతల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ సిటీలో బస్ బేలు, శ్మశాన వాటికలు, శానిటేషన్ బాగా లేవన్నారు. ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధి చేద్దామన్నారు. త్వరలోనే హెల్త్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వరంగల్ ఎంజీఎంను మాత, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చడంతో పాటు… నిమ్స్ తరహాలో మరో కొత్త ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. అంతే కాదు ఎంజీఎంలోని శిథిల భవనాలను తొలగించి కొత్త టవర్స్ నిర్మించాలన్నారు.

అంతకు ముందు వరంగల్ భూపాలపల్లిలో కేటీపీపీ రెండో ఫేజ్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.తరువాత బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాబోయే రెండేళ్లలో రైతులకు పగటిపూటే 9గంటల కరెంటు ఇస్తామన్నారు. ఇక ఓసీ బీసీ అని సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలతో అభివృద్ధిని అడ్డకుంటోందని ఆరోపించారు సీఎం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy