వరంగల్ మొదటి స్థానం : స్కూళ్లకి విద్యార్థులు డుమ్మా

STUDENTS DUMMAరాష్ట్రంలో బడిమానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2016 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన డ్రా పౌట్స్  వివరాలను సర్వశిక్ష అభియాన్  అధికారులు విడుదల చేశారు. స్కూల్ మానేస్తున్న పిల్లల సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

ప్రాథమికోన్నత స్థాయిలో బడిమానేస్తున్న పిల్లల సంఖ్య భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో బడి మానేస్తున్న పిల్లల్లో మార్పుతీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సర్కార్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.

జిల్లాలో ప్రాథమిక స్థాయిలోనే డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. గత అకడమిక్ ఇయర్ లో డ్రాపౌట్స్ వివరాలపై సర్వశిక్ష అభియాన్ అధికారులు స్టడీ చేసి ఓ నివేదికను విడుదల చేశారు. అందులోని గణంకాలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. బడిమానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు అధికారులు. బడి మానేస్తున్నవారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారని… ఇందుకు ఆర్థిక పరిస్థితులే కారణమంటున్నారు. బాల్య వివాహాలు కూడా డ్రా పౌట్స్ కు ఓ కారణమని చెబుతున్నారు.

అయితే పిల్లలను బడికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని టీచర్లు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే పిల్లలను వ్యవసాయ పనుల్లోకి తీసుకెళ్తున్నారని..అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బడిమానేసిన పిల్లలు చైల్డ్ లేబర్ గా మారుతుండటంతో అధికారులు అటువైపు దృష్టిసారించి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయించవద్దని ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత సాధించేలా అందరూ కృషి చేయాలి. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత కలిసి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy