వరంగల్ లో ఇంటర్ నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

Screen Shot 2016-01-09 at 10.34.38 AMఇంటర్ నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వరంగల్ వేదికయింది.  రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్, సినీ దర్శకుడు గుణశేఖర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను  ప్రారంభించారు. లోగోను ఆవిష్కరించారు. కాకతీయ వీరనారి రుద్రమదేవిపై   సినిమాగా తీసిన  దర్శకుడు గుణశేఖర్ ను ఘనంగా సన్మానించారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు గుణశేఖర్. ఓరుగల్లుకు గొప్ప చరిత్ర ఉందన్న  ఆయన రుద్రమదేవి సినిమాతో కాకతీయుల చరిత్రను విశ్వవ్యాప్తం చేయగలిగానన్నారు. ఫ్యూచర్ లో వరంగల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వేదికవ్వాలన్నారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు, కళలను కాపాడుకుంటామన్నారు గిరిజన శాఖమంత్రి చందూలాల్. కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మూడు రోజులు జరగనున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్  ఇనాగ్రల్ సెర్మనీలో… కళకారుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy