వరకట్నకేసు నమోదైతే వెంటనే అరెస్ట్: సుప్రీం

మహిళలపై రోజు రోజుకీ ఎక్కడో అక్కడ  ఏదో రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా దాడులు మాత్రం ఆగటం లేదు. ముఖ్యంగా వరకట్న వేధింపులు ఎక్కువ కావడంతో…ఆ కేసులపై సుప్రీంకోర్టు కొత్త తీర్పునిచ్చింది. సెక్షన్ 498A కింద నమోదు అయ్యే వరకట్న కేసుల్లో.. వెంటనే అరెస్టులు జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ సెక్షన్ కింద నమోదు అయ్యే కేసులను ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ పరిశీలించాలని గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం మళ్లీ మార్చేసింది. గత తీర్పును సవరించిన కోర్టు… 498A కేసు కింద వెంటనే అరెస్టులు చేయాలని శుక్రవారం(సెప్టెంబర్-14) ఆదేశించింది. సెక్షన్ 498Aను దుర్వినియోగం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

One Response to వరకట్నకేసు నమోదైతే వెంటనే అరెస్ట్: సుప్రీం

  1. Santhoshi reddy says:

    Sir what if the husband is at USA not coming to India even though we put an 498 case on him. He is not attending the court even though the judge warns them. So whats the solution for this sir

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy