వరదొచ్చినా టోక్యో మునగదు!

ఇవి బిల్డింగ్ కోసం వేసిన పిల్లర్స్ కాదు. వరదనీళ్ళు పోయే టన్నెల్ కోసం ఏర్పాటు చేసినవి

ఇవి బిల్డింగ్ కోసం వేసిన పిల్లర్స్ కాదు. వరదనీళ్ళు పోయే టన్నెల్ కోసం ఏర్పాటు చేసినవి

ఉన్నట్టుండి భారీ వర్షం వస్తే ఊళ్లలో నీట మునిగే పొలాలు.. సిటీల్లో చెరువుల్లా మారిపోయే రోడ్లు, కాలనీలు మాత్రమే మనకు తెలిసిన విషయం. కానీ.. జపాన్ రాజధాని టోక్యోలో ఇలాంటి పరిస్థితే కనిపించదు. అక్కడ.. ఎప్పుడు.. ఎంత భారీ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1993 నుంచి 2006 వరకు.. దాదాపు 14 ఏళ్లు కష్టపడి పూర్తి చేసిన వాటర్ డిశ్చార్జ్ టన్నెల్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో.. వరదల ముప్పు నుంచి టోక్యో దూరంగా ఉంటోంది. వాటర్ డిశ్చార్జ్ టన్నెల్స్. 5 అంతస్తుల భారీ బిల్డింగ్ సైజు ఎత్తు… 320 అడుగుల వెడల్పుతో అండర్ గ్రౌండ్ లో నిర్మించిన భారీ సొరంగాలు… వరదల నుంచి టోక్యోను సేవ్ చేస్తున్నాయి. వరద నీటిని దాదాపు 4 మైళ్ల దూరం పాటు… దగ్గర్లో ఉన్న ఇడో నదిలోకి పంపేయడంలో ఈ టన్నెల్స్ సక్సెస్ అవుతున్నాయి. హై పర్ఫార్మెన్స్ కెపాసిటీ ఉన్న జెట్ ఇంజన్స్ తో పనిచేసే టర్బైన్లు… ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నాయి.

వాటర్ డిశ్చార్జ్ టన్నెల్ ప్రాసెస్ చూస్తే… అచ్చం ఓ ఫిక్షన్ సినిమా చూసినట్టే ఉంటుంది. కానీ.. ఓ సారి భారీ వర్షాలతో వచ్చిన ఇబ్బందులపై పూర్తిగా స్టడీ చేసిన జపాన్ సైంటిస్టులు… 1800 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో… 14 ఏళ్లకు పైగా కష్టపడి ఈ భారీ సొరంగాలను కట్టారు. ఏ టైమ్ లో భారీ వరదలు వచ్చినా… టోక్యోకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు.

చిన్న జల్లు కురిస్తే చాలు. అడుగు తీసి అడుగేయాలన్నా అధ్వానంగా మారే మన సిటీలు కూడా… టోక్యోలా మారాలంటే ఎన్నేళ్లు పడుతుందో!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy