వరదొచ్చినా.. నీళ్లకు ఇంకా కటకటే

Telangana-Rainsరాష్ట్రంలో  ఒక వైపు  జలకళ.. ఇంకోవైపు  నీళ్లకు కటకట  ఉంది. ఈమధ్య  కురుస్తున్న  వర్షాలతో.. గోదావరి  బేసిన్  రిజర్వాయర్లకు.. అంతో ఇంతో  నీళ్లు చేరుతున్నాయి.  కానీ  కృష్ణా బేసిన్  ప్రాజెక్టులు  మాత్రం… నీళ్లు లేక  కళ తప్పాయి. దక్షిణ తెలంగాణ  ప్రాజెక్టులు  వట్టిపోతున్నాయి.  రైతన్నలకు  సాగు కష్టంగా  మారింది.

రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నీళ్ల ప్రాజెక్టులపైనే ఆధారపడి.. వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ప్రాజెక్టులకు నీళ్లొస్తేనే రైతులు రెండు పంటలు పండించే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ కు దిక్కైన కృష్ణా బేసిన్ మాత్రం ఎండిపోయింది. కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులలో నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కిందికి పడిపోయాయి.

ప్రాజెక్టులలోకి నీళ్లొచ్చేందుకు అగస్టు నెలనే సరైన సమయం. కాని ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టులు నిండలేదు. గత వారం నుంచి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు.. గోదావరి బేసిన్ ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగ ర్ ప్రాజెక్టుల కు కొంత వరదొచ్చింది. SRSP పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు.. ప్రస్తుతం 28 టీఎంసీల నీరొచ్చింది. ఇప్పటికీ ఇన్ ఫ్లో కొనసాగుతోంది. నిజాంసాగర్ 17.8 టీఎంసీల సామర్ధ్యానికి.. ప్రస్తుతం 2.26 టీఎంసీల నీళ్లొచ్చాయి.

సింగూరుల 29 టీఎంసీలకు.. 19 టీఎంసీల నీరుంది. LMD ప్రాజెక్టుల 7 టీఎంసీలు, కడెం ప్రాజెక్టుల 7.60 టీఎంసీల సామర్థ్యానికి.. 7.14 టీఎంసీల నీరు చేరింది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు.. 14 టీఎంసీల నీళ్లున్నాయి. గోదావరి డెల్టా సిస్టం ప్రాజెక్టు పూర్తిగా నిండింది.

ఎటొచ్చి కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిస్థితే దారుణం. శ్రీశైలం ప్రాజెక్టుల 215 టీఎంసీల సామర్థ్యానికి.. 22 టీఎంసీల నీళ్లున్నాయి. నాగార్జునసాగర్ లో 312 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి.. ప్రసుతం 115 టీఎంసీల నీరే ఉంది. జూరాలలో 6 టీఎంసీల నీరుంది. ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండినా.. అక్కడి నుంచి నీటిని వదలకపోవటంతో.. కృష్ణా డెల్టా ఎండిపోతోంది. హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 15 టీఎంసీల నీళ్లు కావాలని.. తెలంగాణ సర్కార్ లేఖ రాసినా.. కర్ణాటక పట్టించుకోలేదు.

ఆల్మట్టి నుంచి నీటిని కిందికి వదలకుండా.. రివర్స్ పంపింగ్ చేస్తోంది కర్ణాటక. ఆల్మట్టికి వచ్చే వరదనీటితో.. స్థానిక ప్రాజెక్టులను నింపుతోంది. దీంతో ఆల్మట్టి నిండగానే.. మన ప్రాజెక్టులకు నీళ్లొస్తాయని ఎదురుచూసిన తెలుగురాష్ట్రాల రైతులకు నిరాశే మిగిలింది. సీజన్ లో రావాల్సిన నీళ్లు రాకపోతే.. కృష్ణా డెల్టా రైతులకు ఇబ్బందులు తప్పవు. దీంతో కృష్ణమ్మ రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy