వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌: ఫైనల్లోకి సింధు

pv-sindhuరియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు.. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఫైనల్‌కు చేరింది. చైనా గోడను బద్దలు కొట్టిన సింధు.. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది.గ్లాస్గో వేదికగా జరిగిన సెమీఫైనల్స్‌లో సింధు 21-13, 21-10తో 9వ సీడ్‌ చెన్‌ యూఫీ (చైనా)పై నెగ్గింది. తొలి గేమ్‌ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. 8-8తో స్కోరు సమమైన సమయంలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 11-8తో బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత కూడా జోరును ప్రదర్శించి 21-13తో తొలి గేమ్‌ను నెగ్గింది. ఇక రెండో గేమ్‌ ఆరంభం నుంచే విరుచుకుపడిన సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 21-10తో గెలిచింది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy