వరల్డ్ ఎగ్ డే: రుచికరం.. ఆరోగ్యకరం

egg-dayసండే హోయా మండే..రోజ్ ఖావో అండే. అని నేషనల్ ఎగ్  కో ఆర్డినేషన్  ప్రకటనల ప్రభావం ఏమో కానీ…  దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ఎగ్గేరియన్స్ పెరిగిపోతున్నారు. వాల్డ్ ఎగ్ డే పై స్పెషల్ స్టోరీ.

తక్కువ రేట్లో ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థం గుడ్డు. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనిలేదని చెబుతుంటారు పెద్దలు. ఆరోగ్య ప్రదాతగా పెద్ద పేరే ఉంది ఈ బుల్లి గుడ్డుకి.

ఎవరైనా సరే గుడ్డునిష్టపడని వారుండరు. అకేషనేదైనా వంటలో గుడ్డు ఉంటే ఆ టేస్టే వేరు. వెజ్ స్పెషల్ అయినా… నాన్ వెజ్ స్పెషల్ అయినా ఆ ఐటమ్స్ గుడ్డు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెజ్ ప్రేమికులు.. నాన్ వెజ్ ప్రేమికులు అందరూ ఎగ్గంటే ఇష్టపడతారు. వెజిటేరియన్స్ కూడా మెనూలో ఎగ్గుకి ప్లేసిస్తారు. అడిగితే ఇది కూడా వెజ్జేనంటారు. అదీ ఎగ్ మీదున్న ప్రేమ.

చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు.. మంచి విటమిన్ లున్న ఫుడ్ కావాలంటే వారి మెనూలో ఎగ్ ఉండాల్సిందే. స్కూల్స్, అంగన్ వాడీ స్కూల్స్, ప్రైవేట్  హాస్టల్స్ అన్ని చోట్లా గుడ్డుది ప్రత్యేక స్థానమే. ఏటేటా అన్నిచోట్లా గుడ్డు వాడకం పెరిగిపోతోంది. ఒరు ఆమ్లెట్ అంటారు. ఒకరు ఫ్రై అంటారు. ఇంకొకరు బాయిల్డ్ అంటారు. ఎగ్ మిర్చి.. ఎగ్ బుర్జీ.. ఎగ్ బజ్జీ ఇలా రకరకాల పేర్లతో ఎగ్గుని ఏపుకుని తింటున్నారు జనం. టేస్ట్ చేయాలనుకున్న వారికి అన్ని రకాలుగా నోరూరిస్తుంది ఎగ్.

గతంలో సఘటున ఒక వ్యక్తి సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు లాగిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. రెస్టారెంట్ల నుంచి… బజ్జీ బండ్ల వరకు.. బేకరీల్లో కూడా ఎగ్టేస్ట్ దొరుకుతుంది. కేకుల్లో కూడా ఎగ్స్ వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఎగ్గుని తినేవారిలో తమిళనాడు వారు ముందుండగా… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేసులో ఉంది. మన రాష్ట్రం నాలుగో ప్లేసులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా అర్భన్ ఏరియాల్లో ఎగ్స్ ను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందంటోంది ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ.

ఇక గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు కూడా ప్రతీ ఏటా కొత్త ఫలితాలను ఇస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాయి. ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకోవడం వల్ల బాడీ ఎదుగుదలకు, కంటిచూపు మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్స్ ను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అనేది వైద్యుల మాట. ఎగ్గుతింటే ఎనర్జిటిక్ గా ఉంటామని చెబుతున్నారు ఎక్స్ పర్ట్ లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy