వరల్డ్ కప్ లో భారత్ కు తొలి ఓటమి

indఐసీసీ విమెన్ వరల్డ్ కప్ లో భారత్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. తొలి నుంచి మంచి జోరు మీదున్న మిథాలీ సేనకు షాకిచ్చారు సఫారీలు. శనివారం దక్షిణాఫ్రికా చేతిలో 115 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. 274 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ (60), జులన్ గోస్వామి (43) మినహా అందరూ విఫలమవడంతో భారత్ 46 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు ఓపెనర్ లిజిల్లే లీ (92) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. టోర్నీ ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ఓపెనర్ స్మృతి మంద‌నా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైఫల్యాల బాట కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకోగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్ డకౌట్‌గా పెవిలియన్ చేరిపోయింది. దీంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (22) దూకుడుగా ఆడినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ (0), వేదా (3), శిఖా ఫాండే (0), సుష్మ వర్మ (1), పూనమ్ యాదవ్ (0) కనీస పోరాట పటిమ కూడా ప్రదర్శించలేకపోయారు. ఆస్ట్రేలియాతో బుధవారం తర్వాత మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ బెర్తు ఖాయం కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy