వరల్డ్ నెంబర్ వన్ : టెస్ట్ ఆల్ రౌండర్ గా జడేజా

jadejaటీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వాల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లలో జడేజా నెంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పటి వరకు నెంబర్ వన్ బౌలర్ గా మాత్రమే కొనసాగుతున్న జడేజాకు ఇది మరో అద్భుత గౌరవం. 28 ఏళ్ల వయస్సులోనే నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందటం ఆషామాషీ కాదని అభిప్రాయపడింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో 70 పరుగులు చేయటమే కాకుండా.. ఏడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 32 టెస్ట్ మ్యాచుల్లోనే 150 వికెట్లు పడగొట్టి టీమిండియాలో రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ రాణించాడు జడేజా. 32 మ్యాచుల్లో 1136 పరుగులు చేశాడు. 65 స్ట్రయిక్ రేటుతో.. 30 పరుగుల యావరేజ్ తో.. 48 ఇన్నింగ్స్ ఆడాడు. ICC  ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టెస్ట్ ఆల్ రౌండర్లలో వాల్డ్ నెంబర్ వన్ గా నిలిచిన జడేజాకు ఆల్ ద బెస్ట్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy