వరల్డ్ సూపర్ సిటీస్ జాబితాలో ఢిల్లీ – ముంబై

Delhi-Mumbaiదేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయికి అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ టాప్ 30 సూపర్ సిటీస్ జాబితాలో చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన, ఉత్పాదక, అనుసంధానిత నగరాల వివరాలతో అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ ఎల్ రేటింగ్ ఇచ్చింది.

అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితాలో మన దేశం నుంచి ఢిల్లీ, ముంబైకి చోటు దక్కింది. ముంబై 22 వ స్థానంలో ఉండగా రాజధాని ఢిల్లీ 24 వ స్థానంలో నిలిచింది. జపాన్ రాజధాని టోక్యో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. అటు న్యూయార్క్, లండన్, ప్యారిస్ టాప్ 4 సూపర్ సిటీలుగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల్లో టోక్యో , న్యూయార్క్, లండన్, ప్యారిస్ ఈ నాలుగు సిటీల వాటానే 50 శాతంగా ఉంది. గ్లోబల్ 300 జాబితాలోని నగరాల్లోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడుల్లో టాప్ 30 లిస్ట్ వాటానే 64 శాతం. వాణిజ్య పరమైన ఆకర్షణీయ అంశాల ఆధారంగా గ్లోబల్ 300 లిస్ట్ ను రూపొందించింది జేఎల్ఎల్ సంస్థ. గతేడాది జాబితాతో పోలిస్తే ర్యాంకింగ్ భారీగా మెరుగుపడిన నగరాల వివరాలతో ప్రత్యేక లిస్ట్ ను రూపొందించింది. ఇందులో ముంబై టాప్ 10 లో నిలిచింది. గడిచిన మూడేళ్లలో 7 శాతానికి పైగా వృద్ధిరేటుతో వాణిజ్య రాజధాని దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశ, మెట్రోనగరాల అభివృద్ధిపై నమ్మకాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడింది జేఎల్ ఎల్ సంస్థ. గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాలకు ముంబై హబ్ గా మారుతుందని చెప్పింది.  ప్రపంచంలోని 2000 అతిపెద్ద కంపెనీల్లో 50 శాతం కంపెనీలు ముంబై నుంచి కార్యకలాపాలు సాగించేందుకు ఇంట్రెస్ట్ చూపాయని సర్వేలో పేర్కొంది. నగరాల ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజు ఆధారంగా వాణిజ్యంలో ఆకర్షణీయ నగరాల లిస్ట్ ను రెడీ చేసింది జేఎల్ఎల్ సంస్థ. ముంబైలో నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, వచ్చే 3 ఏళ్లలో మరో 22 శాతం వరకు పెరగవచ్చని జేఎల్ఎల్ సంస్థ అభిప్రాయపడుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy