వరల్డ్ సైట్ డే: నేత్రాలను కాపాడుకుందాం

eye-inసరైన చర్యలు తీసుకుంటే కంటి జబ్బులను అరికట్టవచ్చన్నారు మాక్స్ విజన్ ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాదరావు. కంటి జబ్బులను మొదటి దశలోనే గుర్తిస్తే 80 శాతం మందిలో తిరిగి చూపు తీసుకొచ్చేందుకు అవకాశముందన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ ప్రజల్లో కంటి సంబంధ సమస్యలపై అవగాహన కల్పించుందుకు  వరల్డ్ సైట్ డేను నిర్వహించారు. మాక్స్ విజన్  ఐ హాస్పటల్  ఆధ్వర్యంలో గురువారం( అక్టోబర్-12) నెక్లెస్ రోడ్డులో అవగాహన వాక్ నిర్వహించారు. అడిషినల్ సీపీ శివప్రసాద్ జెండా ఊపి వాక్ ను ప్రారంభించారు.

డయాబెటిస్ తో బాధపడేవారు కంటి సంబంధ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మాక్స్ విజన్ ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాదరావు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రాంతాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డీసీపీ రవికుమార్ తో పాటు విద్యార్థులు, మాక్స్ విజన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy