వరుడికి గన్‌ గురిపెట్టిన వధువు

2brk-129వివాహ వేడుకల్లో వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో మునిగితేలుతుంటారు. కానీ ఓ వధువు తన గౌనులో దాచుకున్న గన్‌ తీసి పెళ్లికొడుక్కి గురిపెట్టడంతో ఆమె జైలుపాలైంది. ఇంతకీ ఏంజరిగిందంటే.. అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన కేట్‌ ప్రిచర్డ్‌ అనే యువతికి ఆదివారం(జూలై-30 ) వివాహమైంది.

అయితే పెళ్లి అయ్యేవరకూ అందరూ సరదా సంతోషంగా ఉన్నారు. కానీవేడుకలో వధూవరులు మద్యం తాగి ఏదో విషయమై వాదనకు దిగారు. వెంటనే సీరియస్ అయిన వధువు తన గౌనులో పెట్టుకున్న గన్‌ తీసి వరుడికి గురిపెట్టింది. ఈ సంఘటనతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులని పిలవడంతో వరుడు బతికిపోయాడు. పోలీసులు కేట్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేట్‌ తిరిగొచ్చినా తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేనని వరుడు తనవారితో కలిసి వెళ్లిపోయాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy