వరుణదేవా..కరుణించవా : వర్షాల కోసం 72 గంటల దీక్ష

RAINరుతు పవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. నానా రకాలు పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్లిళ్లు, దేవుళ్లకు నీళ్లు పోస్తూ వర్షాలు పడాలని మొక్కుతున్నారు. ఈ క్రమంలోనే వర్షాల కోసం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సొనాల గ్రామానికి చెందిన రైతు హౌస్ పటేల్ స్థానిక హనుమాన్ ఆలయంలో 72 గం టల దీక్ష చేపట్టాడు. శనివారం (జూన్-23) ప్రారంభమైన దీక్ష మంగళవారం (జూన్-26) మధ్యాహ్నం ముగియనుంది. వర్షాలువస్తాయన్న ఆశతో రైతులు విత్తనాలు నాటగా వరుణుడు ముఖం చాటేయటంతో మొలకలు వాడిపోతున్నాయి. దీంతో వాటిని బతికించుకొనేందుకు రైతులు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో హౌస్‌ పటేల్ అన్నపానీయాలు మానేసి హనుమాన్ ఆలయంలో దీక్ష చేపట్టాడని తెలిపారు గ్రామస్థులు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy