వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు

PV_SINDHU1_1బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సూపర్‌ ఫామ్‌ను కొనసాగించింది ఇండియన్ స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు. రెండు వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్ళిన సింధు.. నామమాత్రమైన చివరి పోరులోనూ తిరుగులేని ఆధిపత్యంతో సునాయాసంగా నెగ్గింది. ఆమె 21-9, 21-13తో తనతో పాటే గ్రూప్‌-ఎ నుంచి  సెమీస్‌కు అర్హత సాధించిన జపాన్‌ స్టార్‌ యమగూచిని అవలీలంగా ఓడించింది. తొలి గేమ్‌ ఆరంభంలోనే 5-0తో ఆధిక్యం సాధించిన సింధు.. ప్రత్యర్థికి ఒక్కసారి కూడా పైచేయి సాధించే అవకాశం లేకుండా చేసింది. రెండో గేమ్‌ ఆరంభంలో కొంత ప్రతిఘటించిన యమగూచి.. ఆ తర్వాత సింధు ధాటికి నిలవలేకపోయింది. ఈ విజయంతో సింధు అజేయంగా గ్రూప్‌ దశను ముగించింది. ఆమె మూడు విజయాలతో గ్రూప్‌-ఎలో అగ్రస్థానం సాధించింది. యమగూచి రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌-బిలో రెండో స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించిన చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫీని సింధు సెమీస్‌లో ఢీకొంటుంది. మరో సెమీస్‌లో యమగూచి, గ్రూప్‌-బి టాపర్‌ రచనోక్‌ (థాయిలాండ్‌)ను ఢీకొంటుంది. సెమీస్‌ ఇవాళ జరుగుతాయి. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండు వరుస ఓటములతో సెమీస్‌ అవకాశం కోల్పోయిన శ్రీకాంత్‌.. గ్రూప్‌-బిలో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనూ గెలవలేకపోయాడు. అతను 17-21, 21-19, 14-21తో షి యుకి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ గ్రూప్‌ నుంచి యుకితో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) కూడా సెమీస్‌ చేరాడు. లీ చాంగ్‌ వీ (మలేసియా), వాన్‌ హో సన్‌ (కొరియా) ముందంజ వేశారు. సెమీస్‌లో యుకిని వాన్‌, లీ చాంగ్‌ను అక్సెల్సన్‌ ఢీకొంటారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy