వరుస విజయాలతో : సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

SUNIPLలో వరుస విజయాలతో దూసుకెళ్తుంది సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌. శనివారం(మే-5) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది సన్‌ రైజర్స్‌. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్.. నిర్ణీత 20 ఓవర్లో 5వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ … ఒక బాల్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసి విజయం అందుకొంది. దీంతో తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది సన్‌రైజర్స్‌. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌ లు ఆడిన సన్‌రైజర్స్‌… 7విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ ను ఆక్రమించింది. ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy