వర్మను చంపేసిన పవన్ ఫ్యాన్స్

VARMA TWEETSడైలాగ్ 1 : పవన్ ఫ్యాన్స్ అనాగకరిత వైఖరి తగ్గి.. ట్విట్టర్ ఫాలోవర్స్ పెరుగుతారని ఆశిస్తున్నా

డైలాగ్ 2 : పవన్ కళ్యాణ్ అభిమానులకు చదువురాదు అనటానికి ఈ పోస్ట్ లో రాసిన సందేశమే చెబుతోంది

డైలాగ్ 3: ఫ్యాన్స్ చదువు కోసం PK ముందుగా స్కూల్స్ తెరవాలి

డైలాగ్ 4 : PK అభిమానిగా చెబుతున్నా.. ముందు మీరు చదువు నేర్చుకోండి. తన ఫ్యాన్స్ గురించి పవన్ బాధపడేలా చేయొద్దు

డైలాగ్ 5 : మీ ఆలోచనలలో నన్ను చంపగలరుకానీ.. నా ఆలోచనలను చంపలేరు.

డైలాగ్ 6 : చదువురాని వాళ్లు.. టెక్నికల్ గా ఏమీ తెలియనివాళ్లకు.. నేను చెప్పేది అర్థం చేసుకోలేరు

డైలాగ్ 7 : మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి నేర్చుకోవాలని.. పవన్ కళ్యాణ్ అభిమానిగా కోరుతున్నా

డైలాగ్ 8 : మహేష్ అభిమానులకు నేనో రిక్వెస్ట్ చేస్తున్నా.. నేను అన్న అన్ని ఇంగ్లీష్ పదాలను తెలుగులో తర్జుమా చేసి.. చదువురాని వారి కోసం ప్రచారం చేయండి.. సామాజిక బాధ్యతగా సేవ చేయండి.

డైలాగ్ 9 : పవన్ కళ్యాణ్ ముందు రైతుల కోసం కంటే.. ఆయన అభిమానుల సంక్షేమం కోసం పనిచేయాలి.. ఎందుకంటే.. రైతులు ఎవరూ ఆయన సినిమా టికెట్లు కొనలేరు..

1రాంగోపాల్ వర్మ చనిపోయాడా.. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆయన ఫొటోకు దండేసి.. రెండు కొవ్వొత్తులు కూడా వెలిగించేశారు. అయితే వాస్తవంగా ఇలాంటిది ఏమీ లేదు.. వర్మ చాలా హాయిగా.. ప్రశాంతంగా ఉన్నారు. వర్మ చనిపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో నెట్ లో ఫొటోలు పోస్టే చేశారు. అయితే ఇవి ఎవరికీ తెలియదు కానీ.. వర్మ తన ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేయటం హాట్ ఇష్యూ అయ్యింది. మహేష్ బాబు – పవన్ ట్విట్టర్ ఫాలోవర్స్ పై ఇటీవల వర్మ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ యాక్టీవ్ గా ఉన్నారని.. అందులో సగం కూడా పవన్ లేడన్నారు. మహేష్ ఫాలోవర్స్ సంఖ్యకు పవన్ రీచ్ అయినా.. అప్పటికి ప్రిన్స్ ఫాలోవర్స్ డబుల్ అవుతారని.. ఇంక ఎప్పటికీ దాటే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చాడు. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్మపై యుద్ధానికి దిగారు. వర్మనే టార్గెట్ చేస్తూ.. వర్మ నో మోర్ అంటూ దండలు, కొవ్వొత్తులు వెలిగించి.. రెస్ట్ ఇన్ పీస్ అనే ఫొటోలు పెట్టారు. దీనిపైనా వర్మ తనదైన స్టయిల్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ రైతులకు సహాయం చేయటం కంటే ముందు.. తన ఫ్యాన్స్ చదువు కోసం స్కూల్స్ తెరవాలని కామెంట్ చేశాడు. రెస్ట్ ఇన్ పీస్ పోస్టర్ లో సందేశంలోనూ తప్పులు ఉన్నాయని ఎత్తిచూపాడు. మొత్తానికి వర్మను టార్గెట్ చేసి పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన హంగామా.. ఎంత మంది ఫాలోవర్స్ ను పెంచుతుందో చూడాలి..

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy