వర్మ, చార్మీలకు అకున్ కౌంటర్ : బలవంతం లేదు.. పద్దతిగానే వెళ్తున్నాం

akunడ్రగ్స్ కేసులో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని వస్తున్న వార్తలపై ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పందించింది. ఇప్పటి వరకు 27 మందిని ప్రశ్నించామని.. డ్రగ్స్ కేసులో ఆరుగురు సూత్రదారులున్నారని వివరించారు కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్.  కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కేసు విచారణలో చట్టపరంగా ముందుకెళ్తున్నామని చెప్పిన వీరు.. ఎవరినీ టార్గెట్ చేయడం లేదన్నారు. విచారణపై అనుమానాలు అనవసరం అని.. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం వీడియో తీస్తున్నట్లు తెలిపారు. ఫుటేజ్ ను కోర్టులో సబ్ మిట్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలు, హైకోర్టులో హీరోయిన్ చార్మీ దాఖలు చేసిన పిటీషన్ లో లేవనెత్తిన అంశాలకు పాయింట్ టూ పాయింట్ సమాధానం ఇచ్చారు అకున్ సబర్వాల్.

చార్మీ డౌట్స్, అకున్ కౌంటర్ ఎలా ఉందో చూద్దాం..

చార్మి పిటిషన్: సిట్ విచారణలో చట్ట నిబంధనలు పాటించట్లేదు

అకున్ కౌంటర్: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కచ్చితంగా పాటిస్తున్నాం

చార్మి పిటిషన్: సిట్ లో మహిళా అధికారులు ఉండేలా చూడండి

అకున్ కౌంటర్: సిట్ లో ఇప్పటికే సమర్థులైన మహిళా అధికారి ఉన్నారు

చార్మి పిటిషన్: బలవంతంగా బ్లడ్, గోళ్లు, జుట్టు శాంపిల్స్ తీసుకుంటున్నారు

అకున్ కౌంటర్: వాళ్ల అంగీకారంతోనే శాంపిల్స్ తీసుకుంటున్నాం. వద్దంటే తీసుకోం.

చార్మి పిటిషన్: విచారణకు పిలవడం వల్ల సమాజంలో ఇబ్బందులు వస్తాయి

అకున్ కౌంటర్: నోటీసులిచ్చిన మహిళలను వారికి నచ్చినచోట విచారించడానికి సిద్ధం

చార్మి పిటిషన్: విచారణలో ఇబ్బందిపెట్టేలా ప్రశ్నిస్తున్నట్లు మీడియాలో వస్తోంది

అకున్ కౌంటర్: నిబంధనల ప్రకారం చాలా గౌరవంగా విచారిస్తున్నాం. మొత్తం వీడియో తీస్తున్నాం.

చార్మి పిటిషన్: విచారణ జరుగుతున్న తీరు మీద మీడియాలో రకరకాలుగా వస్తోంది

అకున్ కౌంటర్: కేసు డైరీలో వివరాలన్నీ రహస్యంగా ఉంచుతున్నాం. బయట ఎట్లా రాస్తున్నారో తెలీదు.

రాంగోపాల్ వర్మ : స్కూల్ పిల్లలను కూడా సినిమా వాళ్లను విచారించినట్లు గంటలు గంటలు విచారిస్తారు? వాళ్ల పేర్లు బయటకు చెబుతారా?

అకున్ సబర్వాల్ : పిల్లల పేర్లు బయట పెట్టాం. వారు మైనర్లు. పేరంట్స్ ను పిలిచి మాట్లాడుతున్నాం. వాళ్ల భవిష్యత్ దృష్ట్యా దీన్ని రహస్యంగా ఉంచుతాం. మీరు అడిగారని మేం బయటపెట్టం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy