వర్మ పోస్ట్ పై ఎక్సైజ్ శాఖ క్లారిటీ : ఎవర్నీ టార్గెట్ చేయటం లేదు

ED-220717-CHANDRAVADAN-ABOK-2డ్రగ్స్ కేసును సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్. కేసును నీరుగార్చే విధంగా కామెంట్స్ చేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు చంద్రవదన్.  సినిమా వాళ్లనే టార్గెట్‌ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారణ చేయిస్తుందని వదంతులు వినిపిస్తుండటంతో తెలంగాణ ఎక్సైజ్‌శాఖ తరుపున వివరణ ఇచ్చారు. ఈ కేసు చాలా సున్నితమైనదని చెప్పిన చంద్రవదన్‌.. తాము ఎవర్నీ టార్గెట్‌ చేయడం లేదని అన్నారు. చిన్నారులపైకి సైతం ఎగబాకిన డ్రగ్స్‌ మహమ్మారి సమాజంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు.

భావితరాల వారిని కాపాడే ఉద్దేశంతోనే ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ చాలా జాగ్రత్తగా అన్ని రకాల సాంకేతిక విషయాలు చూసుకుంటూ విచారణ జరిపిస్తున్నారని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. పిల్లలు బలైపోతున్నారని చెబుతున్నా ఎక్సైజ్‌ శాఖ విశ్వసనీయతను దెబ్బకొట్టేలా మాట్లాడటం, విచారణను వక్రీకరించడం సరికాదని చెప్పారు. డ్రగ్స్‌ వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి నుంచి తమకు చాలా సీరియస్‌గా ఆదేశాలు అందాయని, ఆ మేరకే ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. విచారణకు వచ్చిన సినీ ప్రముఖులు తమకు సహకరిస్తున్నారని, మంచి వాతావరణంలో విచారణ జరుగుతోందని వివరించారు చంద్రవదన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy